Tuesday, November 26, 2024

విఆర్ హాస్పిట‌ల్‌లో గాల్‌ బ్లాడర్‌కు అరుదైన చికిత్స.. లాప్రోస్కొపి ద్వారా 100రాళ్లు తొలగింపు..

కంటోన్మెంట్‌, (ప్రభన్యూస్‌) : బోయిన్‌పల్లిలోని మల్టిస్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళ గాల్‌ బ్లాడర్‌కు అరుదైన చికిత్స చేసి 100కుపైగా రాళ్ళను తొలగించారు. 3వ వార్డు మడ్‌ఫోర్ట్‌ క్యాథలిక్‌ చర్చ్‌ గల్లికి చెందిన 44సంవత్సరాల కిరణ్‌రాధిక గత 5 సంవత్సరాలుగా గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు తయారై అనేక ఇబ్బందులెదుర్కొంటు పలు రకాల చికిత్సలు చేయించుకున్నప్పడికి ఫలితం లేక గాల్‌బ్లాడర్‌ నొప్పితో ఇబ్బంది పడుతూ ఆణరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో బోయిన్‌పల్లి పుల్లారెడ్డి నివాసం సమీపంలోని వీఆర్‌ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స కోసం వచ్చి కడుపునొప్పితో ఇబ్బందులెదుర్కొంటుంది. ఆమె సమస్యను తెలుసుకున్న ఫిజీషియన్‌ భరత్‌కాంత్‌ రెడ్డి తనదైన శైలిలో లాప్రోస్కొపి ద్వారా శస్త్రచికిత్స నిర్వహించి 5సంవత్సరాలుగా ఆమె పడుతున్న ఆరోగ్యపరమైన సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు.

2 రోజుల క్రితం శస్త్రచికిత్స అనంతరం కిరణ్‌రాధికను గురువారం వరకు వైధ్యపర్యవేక్షణలో ఉంచి ఆమెను డిస్చార్జి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ భరత్‌ కాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల తరచు ఇలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని, కిరణ్‌రాధిక విషయంలో అప్రమత్తతతో గాల్‌బ్లాడర్‌ నుండి 100కుపైచీలుకు రాళ్ళను తీసివేసి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తిచేసినట్లు తెలిపారు. విఆర్‌ ఆసుపత్రిలో ఐసియుతో పాటు ఎటువంటి శస్త్రచికిత్సలైనా చేసేందుకు కావల్సిన ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఆధునిక వైధ్య పరికరాలతో పాటు అనుభవం కలిగిన వివిధ విభాగాల వైధ్యులు ఉన్నారని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement