Wednesday, November 20, 2024

ఆచార్య ఎన్‌.జి.రంగా వర్సిటీకి అరుదైన అవకాశం.. డ్రోన్‌, పైలెట్‌ శిక్షణా కేంద్రానికి అనుమతి

అమరావతి ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లా ఆచార్య ఎన్‌.జి.రంగా విశ్వవిద్యాలయానికి అరుదైన అవకాశం దక్కింది. వ్యవసాయ డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీకి డీజీసీఏ అధికారులు అనుమతించారు. ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అనుమతులు ఇవ్వడానికి ముందు ఇక్కడి పరిస్థితులను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సంచాలకులు డాక్టర్‌ జితేందర్‌ లౌరా పరిశీలించారు. వ్యవసాయ డ్రోన్‌ల నిర్వహణపై 12 రోజుల కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పరిశోధన కేంద్రానికి అనుమతించారు.

డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ కోసం.. ఇలాంటి కోర్సుకు దేశంలోనే మొదటిసారిగా ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుమతి సాధించింది. వర్సిటీలో అప్సర కార్యక్రమం కింద గత మూడేళ్లుగా డ్రోన్‌ ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యవసాయంలో డ్రోన్‌ల సేవలు మరింత విస్తరించే క్రమంలో.. శిక్షణా కేంద్రానికి అనుమతి రావటంపై వర్సిటీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. డీజీసీఏ నుంచి పూర్తిస్థాయి అనుమతులు రావటానికి మరో రెండు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత డ్రోన్‌ పైలెట్‌ శిక్షణను ప్రారంభిస్తామన్నారు. శిక్షణ పొందిన వారికి యూనివర్సిటీ తరపున సర్టిఫికెట్లు అందజేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement