గ్రామీ అవార్డు విజేత సింగర్ షకీరా బెల్లి డ్యాన్స్‌కు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు! తన బెల్లి డ్యాన్స్‌తో అభిమానుల ప్రేమను కొల్లగొట్టిన ఈ కొలంబీయన్ సింగర్ క్యాంసం విగ్రహన్ని ఆమె సొంత సిటీ బారన్క్విల్లాలో ఆవిష్కరించారు. బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో ఉన్న 6.5 మీటర్లు (21 అడుగుల) విగ్రహాన్ని బారన్క్విల్లా మేయర్ జైమ్ పుమారెజో, ఆమె తల్లిదండ్రుల సమక్షంలో నగరంలోని మాగ్డలీనా నది తీరంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కాంస్య విగ్రహంలో షకీరా.. పొడవాటి రింగుల జుట్టుతో చేతులు పైకి ఎత్తి బెల్లి డ్యాన్స్ చేస్తున్న పోజ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ విగ్రహ రూప శిల్పి అయిన యినో మార్క్వెజ్ మాట్లాడుతూ..’అమ్మాయిలు తమ జీవితంలో ఎటువంటి కలలు కంటారో. వాటిని ఎలా సాధిస్తారో షకీరా కాంస్య విగ్రహం ద్యారా తెలుస్తుంది’ అని తెలిపారు. స్థానిక పిల్లలకు సంబంధించి పలు పాటల కాన్సెర్టుల్లో షకీరాను చూశానని మేయర్ జైమ్ పుమారెజో తెలిపారు. షకీరా 2023లో మూడు లాటిన్ గ్రామీ అవార్డులు గెలుపొందారు.