Tuesday, November 26, 2024

కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ అరుదైన ఘనత..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ఫార్మాట్‌లో 3లేదా అంతకంటే ఎక్కువ సిరీస్‌ల్లో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్‌ చేసిన భారత తొలి కెప్టెన్‌గా రోహిత్‌ నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో మూడో కెప్టెన్‌గా నిలిచాడు. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసి రికార్డు సృష్టించిన రోహిత్‌ అంతకుముందు.. 2017లో అప్పటి కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ గైర్హాజరీతో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు నాయకతం వహించాడు. రోహిత్‌ నాయకత్వంలోని భారతజట్టు లంకతో సిరీస్‌ను 3-0తో క్లీన్‌సీప్‌ చేసింది. అదేవిధంగా 2018లో మరోసారి కోహ్లీ గైర్హాజరీతో రోహిత్‌ సారథ్యంలోని భారతజట్టు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన రోహిత్‌శర్మ 2021 చివర్లో న్యూజిలాండ్‌ను 3-0తేడాతో ఓడించి టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేశాడు.

ఈనేపథ్యంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ టీ20 సిరీస్‌లను వైట్‌వాష్‌ చేసిన కెప్టెన్ల జాబితాలో రోహిత్‌ చేరాడు. ఈ జాబితాలో పాక్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, అఎn్గాన్‌ కెప్టెన్‌ అస్గర్‌ అఫ్గర్‌ ఉన్నారు. సర్ఫరాజ్‌ ఖాతాలో 5టీ20 సిరీస్‌లు క్లీన్‌స్వీప్‌ రికార్డు ఉండగా అస్గర్‌ ఖాతాలో 4టీ20 సిరీస్‌ల వైట్‌వాష్‌ రికార్డు ఉంది. కాగా గత నాలుగు టీ20 సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై భారత్‌ ప్రదర్శనను పరిశీలిస్తే..2018లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టీమిండియా 3-0తో విజయం సాధించింది. 2019లో వెస్టిండీస్‌ పర్యటనలోనూ3-0తేడాతో గెలిచింది. 2019లోనే స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లోనూ భారత్‌ 2-1తో గెలిచింది. 2022లో స్వదేశంలోనూ3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement