Monday, November 25, 2024

వేగంగా రేషన్‌ షాపుల డిజిటలైజేషన్.. కార్డుదారులకు నాణ్యమైన సేవలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకే చౌక ధరల దుకాణాల్లో డిజిటలీకరణను ప్రవేశపెట్టామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖా మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. రేషన్‌ షాపుల డిజిటలీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ అంశంపై శనివారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 17, 500 చౌక దుకాణాల్లో త్వరలో డిజిటలీకరణ ముగియనుందన్నారు. ఆధునాతన టెక్నాలజీతో కూడిన ఈ పాస్‌ యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషిన్ల అనుసందానం, వాటి స్టాంపింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని డిపార్మెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు.

వినియోగదారులకు, రేషన్‌ సరుకులు తీసుకునే 2కోట్ల 87లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. ఏప్రిల్‌లోనే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1545 షాపులను అనుసందానించే ప్రక్రియ పూర్తి చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా విడుతల వారీగా జూన్‌ నెలాఖరు కల్లా అనుసందానిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ మెట్రాలజీ డీఎల్‌ఎమ్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌ అసిస్టెంట్‌ కంట్రోలర్లు, సీజీజీ డైరెక్టర్‌, పౌరసరఫరాల అధికారులు, విజన్‌ టెక్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement