వరంగల్, ప్రభన్యూస్ సిటిబ్యూరో: మహిళలపైన… మైనర్ బాలికలపైన నిత్యం.. అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో కామాంధులు పెట్రేగిపోతున్నారు. అన్యం.. పుణ్యం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కనపర్తి గ్రామానికి చెందిన బాలికపై గురువారం రాత్రి అత్యాచారం చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అదే గ్రామానికి చెందిన పస్తం శ్రీకాంత్ అనే వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచాాంనికి పాల్పడినట్లుగా బాధితురాలు తండ్రి కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనిపర్తి ప్రాథమిక పాఠశాల ఆవరణలో అర్ధరాత్రి వేళలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు కమలాపూర్ సీఐ మహేందర్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..