హస్తినలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై కొంతమంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నది. కొన ఊపిరితో జీవితం కోసం పోరాడుతున్నది. ఢిల్లి కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ స్వాతీ మాట్లాడుతూ.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.
నార్త్ ఈస్ట్ ఢిల్లికి చెందిన ఓ 8ఏళ్లబాలిక.. స్నేహితులతో ఇంటి ముందు ఆడుకుంటోంది. ఇద్దరు కామాంధులు ఆమెను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ తరువాత ఆమె ఇంటికి తిరిగి వచ్చాక.. కడుపు నొప్పితో విలవిల్లాడింది. రక్తస్రావం అవుతుండటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికపై గ్యాంగ్ జరిగినట్టు వైద్యులు తెలియజేయడంతో.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు భాగాల్లో గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి రెండు రోజుల్లో రిపోర్టు అందజేయాల్సిందిగా డీసీడబ్ల్యూ పోలీసులను ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..