Tuesday, November 26, 2024

ఫిబ్రవరి 10 నుంచి రంజీ ట్రోఫీ..

రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించేవిధంగా బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు రంజీ షెడ్యూల్‌ను ఆయా రాష్ట్రాలకు గురువారం బీసీసీఐ కార్యదర్శి జైషా వివరాలను అందజేశారు. దేశవ్యాప్తంగా తొమ్మిది వేదికల్లో రంజీ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఐపీఎల్‌కు ముందు..ఐపీఎల్‌ తర్వాత రంజీమ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 15వరకు తొలి దశ, మే 30 నుంచి జూన్‌ 26వరకు రెండో దశను నిర్వహించనున్నట్లు జైషా తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ జట్టు గ్రూప్‌-ఈలో ఉండగా, హైదరాబాద్‌ జట్టు ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఉంది.

ఈ గ్రూప్‌బిలో బెంగాల్‌, బరోడా, హైదరాబాద్‌, చండీగఢ్‌ జట్లు ఉండగా మ్యాచ్‌లను కటక్‌లో నిర్వహించనున్నారు. అదేవిధంగా గ్రూప్‌-ఈలో ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, సర్వీసెస్‌, ఉత్తరాఖండ్‌ ఉన్నాయి. ఈ ఏడాది రంజీట్రోఫీ సీజన్‌లో 62రోజులపాటు 64మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement