పాఠశాల సమయాల్లో బస్సులు నడపాలని ప్రధాన రహదారిపై రాస్త రోకోకి దిగారు విద్యార్థులు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మాదారం , రావిచెడ్ , న్యమతాపూర్ గ్రామాల నుంచి కడ్తాల్ పట్టణానికి పాఠశాల సమయాల్లో బస్సులు నడపాలని ఆయా గ్రామాల విద్యార్థులు కడ్తాల్ లో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా విద్యార్థులు మహేశ్వరం , షాద్ నగర్ ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు . లాక్ డౌన్ కంటే ముందు మండలం లో అన్ని గ్రామాలకు బస్సులు నడిచేవని ప్రస్తుతం అదనంగా నడుస్తున్న బస్సులను రద్దు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు.
గ్రామాలకు నడుస్తున్న బస్సులు రద్దు చేసి పట్టణాలకు నడిపిస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాఠశాలకు ఎలా వెళ్లాలని , బస్సులు లేకపోవడం వలన ప్రమాదకరంగా ఆటోలలో ప్రయాణం చేయవలసి వస్తుందని వెంటనే ఆర్టీసీ అధికారులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.