సరూర్‌నగర్, (ప్రభ న్యూస్) : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 22వ తేదీన ఎల్బీనగర్ చౌరస్తా నుండి ఒలింపిక్ రన్ నిర్వహిస్తుననట్లు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి రవికుమార్, రన్ ఆర్గ నైజింగ్ సెక్రెటరీ మనోహర్‌రెడ్డిలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు ఎల్బీనగర్ నుండి మొదలైన ఈ రన్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హాజరవుతు న్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు జ్యోతిని ముఖ్య అతిధికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అత్యుత్తమ క్రీ డాకారులను సన్మానించడం జరుగుతుందని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.