Friday, October 18, 2024

సహనం కోల్పోయి.. అభిమాని ఫోన్ విసిరేసిన రణ్ బీర్ కపూర్

సాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ కి కోపం రాదు..కానీ సహనం కోల్పోయి అభిమాని ఫోన్ విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. రన్బీర్ కపూర్ అతని ఫోన్ ను తీసుకొని విసిరేశారు. అభిమాని సెల్ఫీ కోసం వచ్చిన సమయంలో రన్బీర్ నవ్వుతూనే అతనికి ఫొటో తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మరోమారు సెల్ఫీ తీసేందుకూ ప్రయత్నించినా స్మైల్ ఇచ్చారు. ఫొటో సరిగా రాకపోవడం వల్లో.. ఫోన్ పనిచేయకపోవడం వల్లో ఆ అభిమాని మూడోసారి కూడా ఫొటో తీసే క్రమంలో రన్బీర్ సహనం కోల్పోయారు. అతని ఫోన్ చూడటానికని తీసుకొని వెనక్కి విసిరేశారు. రన్బీర్ అలాంటి వాడు కాదని, వీడియో పూర్తిగా లేకపోవడంతో ఆ అభిమానికి ఏదైనా సర్ ప్రైజ్ ఇచ్చాడేమో అని అంటున్నారు. ఎక్కువ శాతం మాత్రం ఇది నమ్మశక్యంగా లేదంటున్నారు. అయితే, ఓ బ్రాండ్ కు సంబంధించిన ఫోన్ అడ్వర్టైజ్ మెంట్ కోసం తీసిన యాడ్ ఫిల్మ్ అంటున్నారు. భిన్నంగా తమ ప్రాడక్ట్స్ ను ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకానీ రన్బీర్ ను తప్పుగా భావించొద్దని ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement