Saturday, November 23, 2024

డాగ్స్ స్వ్కాడ్ లో తొలి మెంబ‌ర్ రాణా క‌న్నుమూత‌-గౌర‌వ వీడ్కోలు

క‌ర్ణాట‌క డాగ్స్ స్వ్కాడ్ లో తొలి మెంబ‌ర్ రాణా క‌న్నుమూసింది. 13 ఏళ్ల జర్మన్ షెపర్డ్ మంగళవారం బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో కన్నుమూసింది. దీనిని బీటీఆర్ డైరెక్ట‌ర్ రమేష్ ధృవీక‌రించారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా రాణా చ‌నిపోయింద‌ని ఆయ‌న ‘టీఎన్ఐఈ’ కి తెలిపారు. రాణా పదవి నుంచి రిటైర్డ్ అయినప్పటికీ, మాకు మారో డాగ్ దొరికినప్పటికీ.. రాణా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని ఆయన అన్నారు. 2014లో డిపార్ట్‌మెంట్‌లో చేరిన రాణా… భోపాల్ లోని డాగ్ స్క్వాడ్ స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ 9వ బెటాలియన్ లో ట్రైనింగ్ తీసుకుంది.

ఈ డాగ్ కేవలం గత ఐదేళ్లలో 50 కేసులకు సహాయం చేసింది. పులుల వేట కేసులను ఛేదించడంలో, ఆయుధాలను కనుగొనడంలో రానా మాస్టర్ గా నిలిచింది. ఈ ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే డాగ్ స్క్వాడ్ ట్రైనర్ ప్రకాష్ హొన్నాకోర్ తీవ్ర షాక్ కు గుర‌య్యారు. కర్ణాటక మొదటి డాగ్ స్క్వాడ్ లో రాణాకు ఆయ‌నే శిక్ష‌ణ ఇచ్చాడు. రాణాతో క‌లిసి ఉన్న మొదటి, చివరి వ్యక్తి ఆయ‌నే. ప్ర‌కాష్ రాణాను డాగ్ స్క్వాడ్‌లో చేర్చి భోపాల్‌లో శిక్షణ ఇచ్చారు. అత‌డి చివరి రెండేళ్ల సర్వీస్‌లో రాణాతోనే ఉన్నారు. వీరిద్ద‌రూ క‌లిసి దాదాపు 30 కేసులను పరిష్కరించారు. కాగా ట్రాఫిక్‌కు చెందిన డాక్టర్ సాకేత్, వన్యప్రాణి నేరాలను పరిష్కరించే అత‌డి బృందం రాణాను అటవీ శాఖలో ప్రవేశపెట్టింది. రాణాకు గౌర‌వ వీడ్కోలు ఇవ్వాల‌ని అటవీశాఖ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement