ఇప్పటికే పలువురు క్రికెటర్ల బయోపిక్ లు తెరకెక్కాయి. కాగా ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ తెరకెక్కనుంది. బెంగాల్ టైగర్’గా, ప్రిన్స్ ఆఫ్ బెంగాల్ , దాదా గా అభిమానుల మనసులు గెలుచుకున్న సౌరవ్ గంగూలీ, ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే ప్రఖ్యాత లార్డ్స్‌లో భారీ సెంచరీ చేసి, అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్ రాయుళ్లను భయపెట్టి, విదేశీ క్రికెటర్లతో ఢీ అంటే ఢీ అని మాటకు మాట సమాధానం చెప్పిన సౌరవ్ గంగూలీ… క్రికెట్, వ్యక్తిగత జీవితంలో తెలియని విషయాలు ఈ బయోపిక్‌లో ఎలా చూపిస్తారో చూడాలి.. ఈయన బయోపిక్ తెరకెక్కనుందట. కాగా గంగూలీగా నటించనున్నారట బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్. సౌరవ్ గంగూలీ సినిమాని మొదలెట్టడానికి ముందు కోల్‌కత్తాలో ఈడెన్ గార్డెన్స్‌లో దాదా సమక్షంలోనే క్రికెట్ ట్రైయినింగ్ తీసుకోబోతున్నాడు రణ్‌బీర్ కపూర్.
అలాగే గంగూలీ ఇళ్లు, బారిసా హౌస్, మోహన్ బగన్ క్లబ్ వంటి ప్రదేశాల్లో తిరిగి గంగూలీ గురించి చాలా విషయాలను తెలుసుకోబోతున్నాడట కెప్టెన్‌గా టీమిండియా 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేర్చిన సౌరవ్ గంగూలీ, 2002లో నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత లార్డ్స్ బాల్కనీలో షర్టు విప్పి సెలబ్రేట్ చేసుకోవడం క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ మరిచిపోలేరు..గ్రెగ్ ఛాపెల్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక కెప్టెన్సీ కోల్పోయి, టీమ్‌లో ప్లేస్ కూడా కోల్పోయిన సౌరవ్ గంగూలీ… దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫామ్ నిరూపించుకుని తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అంతేనా ప్రేమ, పెళ్లి, నగ్మా ఎఫైర్ ఓ ఎత్తు అయితే.. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకోవడం, విరాట్ కోహ్లీతో విభేదాలు మరో ఎత్తు… ఇలా గంగూలీ జీవితంలో ఓ కమర్షియల్ సినిమాకి కావాల్సినంత మసాలా ఉంది.