Friday, November 22, 2024

రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్‌.. వినూత్న సాంకేతికతో అంతర్జాతీయంగా సేవలు..

న్యూఢిల్లి : ఆసియాలోనే అగ్రగామిగా నిలిచిన పర్యావరణ నిర్వహణ సేవా సంస్థ రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ తమ కొత్త బ్రాండ్‌ గుర్తింపును వెల్లడించింది. ఇక దీన్ని రీ సస్టెయినబిలిటీగా పిలువనున్నట్టు ప్రకటించింది. రీ సస్టెయినబిలిటీ సీఈఓ అండ్‌ మేనేజిగ్‌ డైరెక్టర్‌ ఎం గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 25 ఏళ్లకు పైగా కంపెనీ సేవలు అందిస్తున్నదని, మొత్తం వ్యర్థ విలువ గొలుసుకట్టులో కంపెనీ ఆధిపత్యం చూపుతున్నదని వివరించారు. పర్యావరణ పరిష్కారాల పరంగా సుదీర్ఘమైన భాగస్వామిగానూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ పరంగా అగ్రగామిగా ఉంటూ.. వినూత్నమైన, సస్టెయినబల్‌ పరిష్కారాల్లో పరిశ్రమలో అగ్రగామిగా మారడంలో కంపెనీ ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని వివరించారు. విభిన్నమైన పరిశ్రమల వ్యాప్తంగా నైపుణ్యంతో వ్యర్థాలను విలువైన సంపదగా మార్చే వినూత్న సాంకేతిక పరిష్కారాలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు.

రీ థింక్‌.. రీ యూజ్‌..

పర్యావరణం పరంగా సుస్థిరమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, తాము కేవలం రీసైక్లింగ్‌ మాత్రమే చేయాలని అనుకోవడం లేదని, రీథింక్‌ (పునారాలోచన), రెడ్యూస్‌ (తగ్గించడం), రీయూజ్‌ (పునర్వినియోగం), రీపర్పస్‌ (పునర్నిర్మాణం), రెప్లినిష్‌ (తిరిగి నింపడం), రీస్టోర్‌ (పునరుద్ధరించడం)లోనూ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నామన్నారు. రీ సస్టెయినబిలిటీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మసూద్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. రామ్కీ ఎన్విరో చక్కటి పారిశ్రామిక పద్ధతులకు మూల స్తంభంగా మారడానికి చాలా కాలం ముందు నుంచే బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలకు నాయకత్వం వహించిందన్నారు. దశాబ్దాలుగా, విప్లవాత్మక పర్యావరణ అనుకూల ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహించడంతో పాటుగా ఈ పరిశ్రమలో తన స్థానాన్ని పూర్తి బలోపేతం చేసుకుందన్నారు.

భూమిపై వ్యర్థమనేదే లేదు..

భూమిపట్ల తమకు ఉన్న నిబద్ధత, ఈ ప్రపంచంలో వ్యర్థమనేది లేదని, ప్రతీ ఒక్కటి మరో దానికి వనరు అవుతుందనే భావనతో ఉన్నామని తెలిపారు. ఈ భావనల నుంచి సమగ్రమైన పరిష్కారాలను రూపొందించాలనే ప్రేరణ కలిగిందన్నారు. దేశ వ్యాప్తంగా 23 నగరాలతో పాటు మిడిల్‌ ఈస్ట్‌, సింగపూర్‌లలో 6-7 మిలియ్‌ టన్నుల మున్సిపల్‌ ఘన వ్యర్థాలను కంపెనీ నిర్వహిస్తోందని తెలిపారు. ఇది సంవత్సరానికి ఒక మిలియన్‌ టన్నుల పారిశ్రామిక వ్యర్థాలను సైతం నిర్వహిస్తోందని, ఈ విభాగంలో రీ సస్టెయినబిలిటీ పూర్తి ఆధిపత్యం చూపుతూ భారతదేశ వ్యాప్తంగా 22 ప్రాంతాల్లో సేవలందిస్తున్నామన్నారు. బయో మెడికల్‌ వ్యర్థ నిర్వహణ పరంగా దేశ వ్యాప్తంగా 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, 4,00,000 పైగా హాస్పిటల్‌, 45వేల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు సేవలు అందిస్తున్నట్టు వివరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement