వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కుంభమేళాపై, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై సెటైర్లు వేశారు. ఇది కుంభమేళా కాదు కరోనా ఆటం బాంబు అంటూ మొదలు పెట్టిన వర్మ.. ఇన్ని లక్షల మందిలో కేవలం 26 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందంటే మనందరం పార్టీ చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. కుంభమేళాను కరోనా ఆటంబాంబుతో పోల్చిన వర్మ.. ఈ వైరల్ పేలుడుకు ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. కుంభమేళా.. గుబ్ బై ఇండియా, వెల్‌కమ్ కరోనా అని మరో ట్వీట్ చేశారు. కుంభమేళా నుంచి వచ్చిన వాళ్లకు మాస్కులే అవసరం లేదని, వాళ్లు ఇప్పటికే గంగలో తమ వైరస్‌ను విడిచి వచ్చేశారంటూ ఇంకో ట్వీట్‌లో వర్మ అన్నారు.
అటు ముంబైలోని 17 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి 6 వారాలు పడితే.. కుంభమేళా సందర్భంగా ఒక్కరోజులో 35 లక్షల మంది గంగలో తమ వైరస్ వదిలారని మరో ట్వీట్‌లో వ్యంగ్యంగా సెటైర్ వేశారు.