కారు యాక్సిడెంట్ నుంచి స్వల్ప గాయాలతో బయటపడింది నటి రంభ.. కెనడాలో స్కూల్ నుంచి పిల్లల్ని కారులో తీసుకొస్తుండగా.. మరో కారు వచ్చి ఢీకొట్టింది. దాంతో రంభతో పాటు ఆమె పిల్లలకి కూడా గాయాలయ్యాయి. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రంభ.. తీవ్ర గాయాలైన కూతురు సాషా త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేయాలని సూచించింది. ఇంటర్సెక్షన్ వద్ద మా కారుని మరో కారు వచ్చి ఢీకొట్టింది. కారులో నాతో పాటు పిల్లలు, అమ్మమ్మ ఉన్నారు. అందరం స్వల్ప గాయాలతో బయటపడ్డాం. కానీ నా చిట్టి తల్లి సాషా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. బ్యాడ్ డేస్.. బ్యాడ్ టైమ్.. సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయండి’’ అని రంభ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెలుగు, తమిళ్, హిందీతో పాటు పలు భాషల్లో సుమారు 100కి పైగా సినిమాల్లో రంభ నటించింది. శ్రీలంకకి చెందిన తమిళ్ బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ని పెళ్లి చేసుకున్న రంభ అతనితో కలిసి కెనడాలో సెటిలైంది. వీరికి 2010, ఏప్రిల్ 10న వివాహమైంది. ఆమెకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. ఇటీవల ఆమెకి సౌత్ ఇండియా నుంచి సినిమా ఆఫర్లు వెళ్లినా రిజెక్ట్ చేసింది. అయితే కొన్ని టీవీ షోస్ లలో మాత్రం కనిపించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement