జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కొత్త చైర్మన్‌గా, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్ 1వ తేదీతో ముగియగా.. ఆ తర్వాత తాత్కాలిక చైర్‌పర్సన్‌గా విజయ భారతి సయానీ నియమితులయ్యారు. తాజాగా పూర్తిస్థాయి చైర్మన్‌గా రామసుబ్రమణియన్ నియమితులయ్యారు.