రామారావు ఆన్ డ్యూటీ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..
కథ ఏంటంటే.1995 చిత్తూరులో జరిగే ఈ కథలో నిజాయితీ గల సబ్ కలెక్టర్ రామారావు రవితేజ . నీతి నిజాయితో ఎక్కడా ఎక్కువ కాలం డ్యూటీ చేయలేకపోతాడు. అంతేకాదు డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎమ్మార్వోగా demote అయ్యి..తన సొంతూరు తిమ్మ సముద్రంకు ట్రాన్సఫర్ అవుతాడు. అక్కడ అతనికి తన చిననాటి లవర్ మాలిని (రజిష విజయన్) కలుస్తుంది. ఆమె భర్త సురేంద్ర (చైతన్య కృష్ణ) ఏడాది పాటుగా కనిపించకుండా పోయాడని తెలుస్తుంది. ఆ కేసును ఛేదించేందుకు రామారావు రంగంలోకి దిగుతాడు. అయితే సురేంద్ర మిస్సింగ్ కేసు పోలీస్ (వేణు తొట్టెంపూడి) పట్టించుకోవడం లేదని అర్దం చేసుకుని, డైరక్టర్ గా రామారావు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు.ఆ క్రమంలో అతనికి ఇలా మిస్సైంది… ఒక్క సురేంద్ర మాత్రమే కాదని… మొత్తం 20 మంది కనిపించకుండా పోయారని అర్దమవుతుంది. దాంతో స్టెప్ బై స్టెప్ క్లూ లు వెతుక్కుంటూ వెళ్తూంటే… అది ఎర్ర చందనం అక్రమ రవాణా దగ్గర ఆగుతుంది. ఈ మిస్సింగ్ కేసులో ఎస్పీ దేవానంద్ (జాన్ విజయ్) పాత్ర ఏంటి? అసలు ఎర్రచందన స్మగ్లింగ్‌కు, 20 మంది కనిపించకుండా పోవడానికి ఉన్న లింక్ ఏంటి? చివరకు రామారావు తన డ్యూటీని పూర్తి చేశాడా? లేదా? అన్నదే కథ.
సినిమా ఎలా ఉందంటే..ఈ చిత్ర టైటిల్, ట్రైలర్ చూడగానే ఇదేదో పక్కా కమర్షియల్ రవితేజ మార్క్ కథ అనుకుంటాం. యాక్షన్ ఎపిసోడ్స్ చూసి క్రాక్ ని దాటేస్తుందేమో అనుకుంటాం. కానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు కాస్త తడబడినట్టే అనిపిస్తుంది. రవితేజ ఎనర్జీని దర్శకుడు ఉపయోగించుకోలేదా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ …విలన్ ఎవరో తెలుస్తుంది అనే ఫార్మెట్ థ్రిల్లర్ సినిమాలో ఓకే కానీ రవితేజ లాంటి కమర్షియల్ హీరోలతో చేసే సినిమాలతో కష్టం. ఎందుకంటే విలన్ ఎప్పుడో చివరిలో తెలిస్తే…అప్పటిదాకా హీరో చేసే పోరాటం అర్దం లేకుండా పోతుంది. విలన్ ,హీరో ..మధ్య బిగ్ ఫైట్ కు తావు ఉండదు. హీరో పూర్తి ప్యాసివ్ గా మారిపోతాడు. ఇదే ఇక్కడ జరిగింది.
టెక్నికల్ … డైరక్టర్ శరత్ మండవ ఈ కథకు రవితేజ లాంటి మాస్ హీరోకు ఎంచుకోవటంలోనే ఫెయిలయ్యారని చెప్పాలి. ఇంట్రస్టింగ్ పాయింట్ తీసుకున్నా చెప్పే విధానంలో తడబడ్డాడు. దాంతో ఆయన డైరక్షన్ స్కిల్స్ ఎలివేట్ కాకుండా అది అడ్డం పడింది. మ్యాజిక్ విషయానికి వస్తే…పాటలు బాగోలేవు. వాటి ప్లేస్మెంట్స్ అసలు బాగోలేదు. ‘నా పేరు సీసా’సాంగ్ కూడా అంత ఊపేమీ ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ డిసెంట్ గా నీట్ గా ఉంది. ఎడిటింగ్ పరంగా చాలా ల్యాగ్ సీన్స్ తీసేయచ్చు అనిపించింది. డైలాగుల్లో చెప్పుకోదగ్గ విషయం లేదు కానీ సినిమా అంతా ఆపు,అంతూ లేకుండా ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు.
నటీనటులు.. రవితేజ చేయదగ్గ పాత్ర కాదు. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ లేని రవితేజ చిత్రం. వేణు తొట్టింపూడి గ్యాప్ తర్వాత కనపడ్డారు కానీ ఆయనకు తగిన పాత్ర కాదు. నాసర్ ,రాహుల్ రామకృష్ణ, నరేష్, పవిత్రా లోకేష్, తణికెళ్ల ,పృధ్వీ అందరూ జస్ట్ ఓకే అన్నట్లుగా ఆ పాత్రల్లో కనపడి వెళ్లిపోతారు. ఎవ్వరివీ గుర్తుంచుకునే పాత్రలు కావు. పవిత్రా లోకేష్ ,నరేష్ వచ్చినప్పుడు మాత్రం జనం బాగా నవ్వారు.నటీనటుల పర్శనల్ లైఫ్ కూడా జనం తెరపై ఐడింటిఫై చేసుకుని స్పందిస్తారని మరోసారి ప్రూవైంది. ఓవరాల్ గా సినిమాపై అంతబజ్ లేదు.