ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం 100 ఏళ్ల కిందటే కరెన్సీ నోటుపై ముద్రించబడింది. ఈ మేరకు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. రామప్ప గుడి ప్రాముఖ్యతను వందేళ్ల కిందే నైజాం రాజులు గుర్తించారు. 1923లోనే రామప్ప ఆలయం చిత్రంతో కూడిన రూ. 10 నోటును అప్పటి ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రూపొందించారు. రామప్ప ఆలయం చిత్రంతో కూడిని రూ.10 కరెన్సీ నోట్లను ప్రింటింగ్ చేసేందుకు థామస్ డెలా అనే కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారు. అప్పట్లో ఈ కరెన్సీని హల్లి సిక్కా లేదా ఉస్మానియా కరెన్సీ అని పిలిచేవారు. కానీ అప్పటికే నోట్ల ప్రింటింగ్‌కు సంబంధించిన ఒప్పందం వాటర్‌లా అండ్ సన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ కంపెనీతో ఒప్పందం కుదిరి ఉండటంతో ఈ నోటు చెలామణిలోకి రాలేదు.
సదరు రూ.10 నోటుపై ఒకవైపు రామప్ప ఆలయం ఉండగా… మరోవైపు ఇంకో ఆలయం కూడా ఉంది. కానీ అ ఆలయం వివరాలను మాత్రం ఇప్పటికీ ఎవరూ కనుక్కోలేకపోయారు. నాటి రూ. 10 నోటుపై ఉన్న మరో ఆలయం ఏమిటో కనుక్కోగలిగితే వారికి వెండి నాణేన్ని బహుమతిగా ఇస్తానని హైదరాబాద్ వారసత్వ నిపుణుడు అమర్‌బీర్ చెప్తున్నారు. ఎవరైనా దాన్ని పోల్చగలిగితే [email protected] కు మెయిల్ చేయాలని ఆయన సూచించారు.
ఈ వార్త కూడా చదవండి: కర్ణాటకలో దారుణం.. 50 కోతులకు విషమిచ్చిన దుండగులు