వర్ధమైన నటుడు నవీన్ బేతగంటి దర్శకుడుగా మారారు. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘రామన్న యూత్’. ఈ చిత్రానికి రజినీ నిర్మాత. గ్రామీణ నేపథ్యంలో నినోదాత్మక కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. తాజాగా ఓ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ గీతాన్ని ప్రస్తుతం కాసర్ల శ్యామ్ రచించారు. కమ్రాన్ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
”రాజుగాని మెల్లోనా సిలకల పేరు నువ్వేనే.. మోజు పడ్డడే నీపైనే ఓ స్వప్నా.. రాజ్యమేదీ లేకున్నా..
హల్చల్ చేస్తడే ఊళ్లోనే.. రాణిలెక్కనే జూస్తాడే ఓ స్వప్నా.. నువ్వు దారం వీడో బీడీ..
మస్తుంటదే ఇద్దరి జోడీ.. ఇల్లుటమే రమ్మం-టొ-స్తడే” అంటూ సాగే ఈ గీతం గ్రామీణ ప్రేమల్లో స్వచ్ఛతను, అమాయకత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించేలా కనిపిస్తోంది.
తెలంగాణ పద ప్రయోగాలతో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను వినగానే ఆకట్టు-కునేలా
ట్యూన్ చేశాడు సంగీత దర్శకుడు. ఈ గీతంలో హీరో, దర్శకుడూ అయిన నవీన్, అమూల్య రెడ్డిల జోడీ అత్యంత సహజంగా ఉంది.
అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ‘రామన్న యూత్’లో అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, అమూల్య రెడ్డి, తదితరులు నటిస్తున్నారు.