సీఎం జగన్‌పై టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. వేల సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని.. ఈ మధ్య దానికి అడ్డంకులు ఏర్పడగా జగన్ దానిని పునరుద్ధరించినందుకు టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పాలకుడిలో కూడా విష్ణు అంశ ఉంటుందని.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్‌కు సూచించారు. సనాతన దర్మానికి ఆటంకం కలిగినప్పుడు జగన్ విష్ణుమూర్తిలా ధర్మాన్ని పునరుద్ధరించారని కొనియాడారు. జగన్ మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని ఆకాంక్షించారు. దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని సీఎంను కోరామని పేర్కొన్నారు.
మిరాశీ హక్కుల కోసం చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు సౌందర్యరాజన్ కూడా పోరాడారని రమణ దీక్షితులు గుర్తుచేశారు. మిరాశీ హక్కు రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ రాజులు ఎన్నో భూములు, ఆభరణాలు సమర్పించుకున్నారని.. వాటిని చేసే అర్చకులు ఆకలితో బాధపడకూడదని భూములు సమర్పించుకున్నారని.. దీన్ని రాజకీయం చేయడం కూడా తగదన్నారు. చెట్టుకు పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమన్నారు. టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివే అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగదని.. వైఎస్ఆర్ హయాంలోram కూడా ఇలానే కొందరు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.