హీరో మంచు విష్ణు, జెనిలీయా జంటగా నటించిన చిత్రం ఢీ..జెనిలియాకి అన్నయ్యగా శ్రీహరి నటించగా..ఆయనకి భార్యగా ప్రేమ నటించింది. కాగా ఈ చిత్రం ఆద్యంత నవ్వులతో ఆకట్టుకుని అప్పట్లో హిట్ గా నిలిచింది. కాగా ఈ చిత్రం రిలీజ్ అయి 15సంవత్సరాలు అయింది. ఈ చత్రాన్ని దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించాడు. కాగా దర్శకుడు శ్రీను వైట్ల చేసిన మేలు మరవలేనని అన్నారు సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి. ఈ మేరకు రామ జోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.’ఢీ’ సినిమా తనకు ప్రత్యేకమైన సినిమా అని చెప్పారు. ‘ఢీ’ టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘ఢీ’ సినిమా వచ్చి 15 సంవత్సరాలు పూర్తి అవుతోన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను ఇంత వరకు ఎదగడంలో దర్శకుడు శ్రీనువైట్ల పాత్ర మరువలేనిదన్నారు. తొలి రోజుల్లో తన ప్రతిభను గుర్తించారని, తనను నమ్మారని ఆయన తెలిపారు. శ్రీను వైట్ల తనకు చేసిన మేలు మరవలేనని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement