హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశానికి చెందిన సుప్రసిద్ధ ఏరోస్పెస్ ఇంజనీర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఇకలేరు. 84 ఏళ్ల వయసులో హైదరాబాద్ లోని తన నివాసంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.
భూతల క్షిపణితో పాటుగా భారత క్షిపణుల్లో మణిహారంగా భావించే అగ్ని ని రూపొందించడంలో ఆయనది ప్రముఖపాత్ర. అందుకే ఆయనను అగర్వాల్‌ను ఫాదర్ ఆఫ్ అగ్ని సిరీస్ ఆఫ్ మిస్సెల్స్ గా పిలుస్తుంటారు.
రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్ లోని జైపూర్‌లో వ్యాపారుల కుటుంబంలో జన్మించారు బెంగుళూరులో ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్, డిఫెన్స్ రీసెర్చ్ సిస్టమ్ లాబొరేటరీ డైరెక్టర్ గా పనిచేశారు. అగర్వాల్ 1983లో అగ్ని క్షిపణి కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
33ఏళ్ల క్రితం మే 22న 1989న ప్రాగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్న అగర్వాల్ తన బృందంతో కలిసి 1000 కిలోల పేలోడ్‌తో 800 కి.మీ. అగ్ని క్షిపణినివిజయవంతంగా పరిశీలించారు. 1990లో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.