”రాముడు హిందువులకే కాదు. అందరికీ దేవుడు, రాముడిని మతంతో ముడిపెట్టడం సరికాదు” అని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. మతం పేరుతో ప్రజలను విడగొట్టే కుట్రలను ఎక్కడికక్కడ ఎదుర్కోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మనమంతా ఐక్యంగా ఉంటేనే మన దేశం కూడా పటిష్టంగా ఉంటుంది. మనమంతా కలిసి సాగుదామని ఫరూక్ సూచించారు. ”ఎన్నికలు ఇప్పుడు దగ్గరలో లేవు.
వారు మీ వద్దకు వచ్చి హిందువులు ప్రమాదకరం. దేశంలో హిందువుల జనాభా 70 నుంచి 80శాతం ఉంది. హిందువులు ప్రమాదకరమా? మీరే ఆలోచించండి” అని పేర్కొన్నారు. ”ఏ మతం చెడ్డది కాదు. మనషులే అవినీతిపరులయ్యారు. ఏ మతం కాదు. ఎన్నికల్లో వారు మతం గురించి మాట్లాడుతూ రెచ్చగొడతారు. అలాంటి వారి మాయలో పడొద్దని ప్రజలకు నాదొక విజ్ఞప్తి” అని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.