పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాన్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాదో లో జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్పీచ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
పవన్ ప్రసంగం ఎంతో హుందాగా, అద్భుతంగా, మనసును హత్తుకునేలా, భావోద్వేగభరితంగా ఉందని ఆయన కితాబునిచ్చారు. ఆయన ప్రవర్తన ఎంతో మర్యాదపూర్వకంగా ఉందని చెప్పారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్ పై వర్మ తనదైన శైలీలో సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. పవన్ అభిమానిగా తాను హర్ట్ అయ్యానని పేర్కొన్నారు.