మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాకి వెళ్లేటప్పుడు అయ్యప్పమాలలో ఉన్నారు.అమెరికాలో మాత్రం ఆయన అయ్యప్ప మాలలో లేకుండా… సూటు, బూటు ధరించి స్టైలిష్ గా కనిపించడం చాలా మందిని అయోమయానికి గురి చేసింది. అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తి సూటు, బూటు ఎలా వేసుకుంటారని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు రామ్ చరణ్ టీమ్ సమాధానమిచ్చింది. హైదరాబాద్ నుంచి న్యూయార్క్ కు వెళ్లేటప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నారని… అక్కడకు వెళ్లిన తర్వాత 21 రోజుల దీక్ష ముగిసి పోయిందని… దీంతో, అక్కడే చరణ్ దీక్షను విరమించారని ఆయన టీమ్ వెల్లడించింది. వచ్చే నెలలో జరగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం ఆయన ముందుగానే యూఎస్ కు వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement