న్యూలుక్ లో మెరిశాడు పవర్ స్టార్ రామ్ చరణ్. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అయిన అలీమ్ హకీమ్ రాంచరణ్ కోసం సరికొత్త హెయిర్ స్టైల్ ను అందించారు. లాంగ్ హెయిర్ లో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది . ఇంత అందమైన లుక్ ను తనకందించినందుకు అలీమ్ కు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ ఇందులో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
శంకర్ దర్శకత్వంలో RC15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ మేకోవర్ కూడా సరికొత్త లుక్కులో కనిపిస్తోంది. బాడీ , న్యూ లుక్స్ తో రామ్ చరణ్ అదరగొడుతున్నారు. తాజా షెడ్యూల్ కోసం ఆయన న్యూ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవ్వగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.