హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి సౌత్ లో ఆఫర్స్ తగ్గాయి. దీంతో ఈ హాట్ బ్యూటీ ఫోకస్ బాలీవుడ్ వైపు మళ్లింది. ప్రస్తుతం రకుల్ శంకర్ ఇండియన్ 2 చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్.. హిందీలో ‘ఛత్రివాలి’ అనే హాట్ కంటెంట్ ఉండే చిత్రంలో నటించింది. శృంగారం విషయంలో అవగాహన కల్పించే టీచర్ పాత్రలో రకుల్ బోల్డ్ రోల్ చేసింది. ఈ చిత్రంలో కండోమ్ తరహా అంశాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇంటర్వ్యూలో తన సినిమా కష్టాలు వివరించింది. నాకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదు.
నా ట్రైనర్ తో కలసి బాంద్రాలోని ఒక కేఫ్ లో కుర్చునేదాన్ని. ఏవైనా ఆడిషన్స్ ఉంటే వెంటనే వెళ్లొచ్చని అక్కడకి వెళ్లేదాన్ని. కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కారులోనే బట్టలు మార్చుకునేదాన్ని. కొన్ని సార్లు ఆఫర్స్ వచ్చేవి. వెంటనే చేజారేవి. కొన్ని చిత్రాల్లో షూటింగ్ జరిగిన తర్వాత కూడా నన్ను తప్పించి మరో హీరోయిన్ ని తీసుకునేవారు. అప్పుడు చాలా బాధగా అనిపించేది అని రకుల్ వివరించింది. వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నట్లు రకుల్ తెలిపింది. ఇదిలా ఉండగా రకుల్ ప్రస్తుతం జాకీ భగ్నానీ అనే బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉంది. త్వరలో వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారు.