Tuesday, November 19, 2024

Rajya Sabha – అర‌వై ఏండ్ల త‌ర్వాత‌ అద్భుత తీర్పు ఇదే … మూడోసారి ద‌క్కిన అవ‌కాశం – మోదీ

ప్ర‌జ‌లు ఆలోచించే మాకు అధికారం ఇచ్చారు
విప‌క్షాల అజెండాను తిర‌స్క‌రించారు
అయినా.. అబ‌ద్ధాలే వారి ప్ర‌చారం
అందుకే నిజాల‌ను విన‌లేక‌పోతున్నారు
కావాల‌నే స‌భ నుంచి పారిపోతున్నారు
విప‌క్షాల తీరుపై రాజ్య‌స‌భ‌లో మండిప‌డ్డ‌ ప్ర‌ధాని మోదీ

పదేళ్లలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బుధ‌వారం ప్రధాని సమాధానమిచ్చారు. విపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు. మోదీ ప్రసంగిస్తున్నప్పుడు నినాదాలు చేసిన విపక్ష సభ్యులు మధ్యలోనే సభ నుంచి వాకౌట్‌ చేశారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్న వారు నిజాలను వినలేకపోతున్నారని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిన విపక్షాలు ఇప్పుడు నినాదాలు చేస్తూ పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని విమర్శించారు.

- Advertisement -

ప్ర‌జ‌ల మ‌హ‌త్త‌ర నిర్ణ‌యం..

“స్వతంత్ర భారత చరిత్రలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంలో అనేక దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు ఒక ప్రభుత్వానికి వరుసగా మూడోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. పదేళ్లు దేశాన్ని పాలించిన తర్వాత ఒక ప్రభుత్వం తిరిగి ఎన్నికవ్వడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 6 దశాబ్దాల తర్వాత జరిగిన ఈ ఘటన అసామాన్యమైనది. కొందరు ఉద్దేశపూర్వకంగా దేశ ప్రజలు తీసుకున్న ఈ మహత్తర నిర్ణయంపై మసిపూయాలని చూస్తున్నారు.” అంటూ మోదీ ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement