Tuesday, November 19, 2024

రాజ్యసభ ఎన్నికలు.. ఐదుగురు అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

రాజ్యసభ ఎన్నికలకు అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, నాగాలాండ్‌ల నుంచి బరిలో నిలిచే అభ్యర్ధుల పేర్లను బీజేపీ ప్రకటించింది. అసోం నుంచి పవిత్ర మార్గరెటా, హిమాచల్‌ నుంచి సింకందర్‌ కుమార్‌, త్రిపుర నుంచి మానిక్‌ సహ, నాగాలాండ్‌ నుంచి ప్యాంగ్‌నాన్‌ కోన్యక్‌ పేర్లను ప్రకటించిన బీజేపీ శనివారం అసోం నుంచి భాగస్వామ్యపక్షం యూపీపీఎల్‌ అభ్యర్ధి రంగ్‌రా నర్జారీ పేరును ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ కేరళ నుంచి జెబీ మాధర్‌, అసోం నుంచి రిపున్‌ బోరాలను రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించింది. జెబీ కేరళ మహిళా కాంగ్రెస్‌ చీఫ్‌గా వ్యవహరిస్తుండగా బోరా అసోం కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌గా పనిచేశారు. బోరాను పెద్దల సభలో రెండో టర్మ్‌కూ ఎంపిక చేశారు. ఇక ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్దానాలకు మార్చి 31న పోలింగ్‌ జరగనుంది. పంజాబ్‌లో ఏప్రిల్‌ 9న పలువురు సభ్యులు రిటైర్‌ కానుండగా ఐదు స్ధానాలు ఖాళీ కానున్నాయి. ఇక మార్చి 22న నామినేషన్ల పరిశీలన జరగనుండగా మార్చి 31న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement