Tuesday, November 19, 2024

National : ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌

15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్‌ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభంకానుంది. మొత్తం 56 స్థానాలకు 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగిలిన మూడు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌ (10), కర్ణాటక (నాలుగు), హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక స్థానానికి పోలింగ్‌ జరగబోతుంది.

- Advertisement -

ఈ 15 రాజ్యసభ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. వీరిలో బిజెపి నుండి 8 మంది, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి)కి చెందిన ముగ్గురు ఉండగా.. 403 మంది సభ్యులున్న యుపి అసెంబ్లీలో కేవలం 397 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హత సాధించారు.

ఏకగ్రీవం అయిన 41 మంది రాజ్యసభ ఎంపిల్లో సోనియా గాంధీ, జెపి. నడ్డాతో పాటు ఇటీవల కాంగ్రెస్‌ నుండి బిజెపిలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ఎల్‌ మురుగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement