కేసుల్లో ఉన్న ఎంపీలను పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అరెస్టు చేసే అంశంపై రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఓ ప్రకటన చేశారు. చట్టాన్ని, న్యాయ ప్రక్రియను గౌరవించడం మన విధిగా భావించాలని వెంకయ్య తెలిపారు. సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎంపీలను అరెస్టు చేయడం లేదా ప్రశ్నించరాదన్న అభిప్రాయాలు కొందరిలో ఉన్నాయని, కానీ అది సరైన విధానం కాదన్నారు. ఎంపీలు కూడా సాధారణ వ్యక్తుల వంటివారే అని అన్నారు. క్రిమినల్ ఆరోపణలున్న కేసుల్లో.. ఆ ఎంపీలకు సభ ఎటువంటి రక్షణ కల్పించలేదని వెంకయ్య తెలిపారు. సభకు హాజరుకావాలన్న ఉద్దేశంతో కేసుల విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని చైర్మెన్ చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement