దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రైతు చట్టాలపై చర్చలకు సిద్దమని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ చట్టాల్లో తమ ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని రైతులు భావించిన క్లాజులపపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు. సాగు చట్టాలను లోతుగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కాగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన రైతులు గత ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పలు చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: పాతబస్తీలో బీబీకా ఆలంను సందర్శించిన షర్మిల..