Tuesday, November 26, 2024

రాజీవ్‌గాంధీ అండర్‌-19 క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పేదవర్గాలకు చెందిన యువకులకు క్రికెట్‌తో పాటు వివిధ క్రీడల్లో నైపుణ్యత ఎక్కువగా ఉన్నప్పటికి..ఉన్నత స్థాయిలోకి రాణించలేకపోతున్నారని మాజీ ఎంపీ, క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ వి. హనుమంతరావు అన్నారు. పేద యువత అంతర్జాతీయ క్రికెట్‌ స్థాయిలో ఎదిగేందుకు రాజీవ్‌గాంధీ అండర్‌-19 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అంబర్‌పేట్‌ ప్లేగ్రౌండ్‌లో రాజీవ్‌గాంధీ 37వ క్రికెట్‌ టోర్నమెంట్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు.

ఈ సందర్శంగా వీహెచ్‌ మాట్లాడుతూ ఎంతోమంది యువతను చిన్న వయసు నుంచే క్రీడల వైపు మళ్లించి, వారికి ఉన్నతమైన ట్రైనింగ్‌ కల్పించి జాతీయ స్థాయి టోర్నమెంటకు ఎంపికయ్యే వరకు ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడుతాయన్నారు. గతంలో సిరాజ్‌, హనుమ విహారి లాంటి క్రీడాకారులను అందించిన ఘనతఈ టోర్నెమెంట్‌కు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్‌ శ్రావణ్‌కుమార్‌, ఫెడరేషన్‌ క్రికెట్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్‌, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్‌, పంజాల జ్ఞానేశ్వర్‌గౌడ్‌ తదిరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement