శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు పొందింది. అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంను కైవసం చేసుకుంది.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రఖ్యాత ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ అయిన సీరియమ్ ద్వారా ఆన్- టైమ్ పని తీరు కోసం ప్రపంచ వ్యాప్తంగా రెండవ అత్యుత్తమ విమానాశ్రయంగా ర్యాంక్ సాధించింది. సీరియమ్ విడుదల చేసిన నివేదికలో 84. 42 శాతం ఓటీపీతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చార్టులలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ‘గ్లోబల్ ఎయిర్‌పోర్ట్‌లు’ అలాగే ‘పెద్ద విమానాశ్రయాలు’ రెండింటిలోనూ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ 2వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క అత్యుత్తమ ప్రయాణీకుల అనుభవాన్ని స్థిరంగా అందించడంలో నిబద్ధతను కలిగి ఉంది.