న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంస్థకు కొత్త అధిపతిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ జెనీవాలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెటర్నల్ న్యూబోర్న్ చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ అండ్ ఏజింగ్ విభాగానికి యూనిట్ హెడ్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌గా ఇంతకాలం పనిచేసిన డా. బలరాం భార్గవ పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో డా. రాజీవ్ బహల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ బాధ్యతలతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ విభాగానికి కార్యదర్శిగానూ ఆయన బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుందని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.