రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ విష్ధారి అభయారణ్యం భారతదేశపు 52వ టైగర్ రిజర్వ్ గా సోమవారం నోటిఫై చేసినట్టు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. రణతంబోర్, సరిస్కా , ముకుంద్ర తర్వాత ఇది రాజస్థాన్‌లో నాలుగో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతానికి పర్యావరణ పర్యాటకం, అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది అని మంత్రి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వన్యప్రాణులను సంరక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని యాదవ్ ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement