రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించుతూ బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మను ఈ పదవికి ఎంపిక చేసింది. జయపురలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు.
భజన్ లాల్ పేరు సీఎంగా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ పేరును మాజీ సీఎం వసుంధర రాజే ప్రకటించారు. సంగనేర్ నుంచి ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్ పై 1,45,000ఓట్లతో విజయం సాధించారు. డిప్యూటీ సీఎంలుగా దియాసింగ్, ప్రేమ్ చంద్ లను ఎన్నుకున్నారు. ఎన్నికకు ముందే వసుంధర రాజే రేసు నుంచి తప్పుకున్నారు.