Saturday, January 4, 2025

Rajasthan Borewell Incident – మృత్యువే గెలిచింది – బోర్ వెల్ లో పడిన బాలిక మృతి

జైపూర్ – రాజస్థాన్ బోర్‌వెల్ ఘటనపై యావత్ దేశం ఆసక్తిగా ఉంది. 700 అడుగుల బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక చేతన ను 10 రోజుల తర్వాత అధికారులు నేడు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కొన ప్రాణాలతో ఉన్న ఆ బాలికను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించింది.

.

రాజస్థాన్ కోట్‌పుట్లీలో గత సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బాలిక తన తండ్రి పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బాబిలో పడిపోయింది పాపని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పలువురు అధికారులు గత 10 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. బాలికకు ఆక్సిజన్‌ని అందిస్తూ వచ్చారు. బోరుబావికి సమాంతరంగా మరో బావిని తవ్వారు. చివరకు అధికారుల ప్రయత్నాలు సక్సెస్ కావడంతో, బాలిక సురక్షితంగా బయటకు వచ్చింది. బోరుబావి నుంచి బాలికను రక్షించిన వెంటనే వైద్య సహాయం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చేతన అక్కడే కన్నుమూసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement