Friday, October 18, 2024

Rajasthan: కోటాలో రాలిన మ‌రో విద్యా కుసుమం

నీట్ కు శిక్ష‌ణ పొందుతున్న విద్యార్ధి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
ఈ ఏడాది ఇప్ప‌టికే 19 మంది విద్యార్ధులు మృతి
ఆందోళ‌న క‌లిగిస్తున్న ఆత్మ‌హ‌త్య‌లు
ఎన్ని కౌన్సెలింగ్ లు ఇస్తున్న ఆగ‌ని మ‌ర‌ణాలు

కోటా: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. నీట్ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇది 19వ మరణం కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన అశుతోష్‌ చౌరాసియా (20) ఏడు రోజుల క్రితమే కోటాకు వచ్చి నీట్‌కు సిద్ధమవుతున్నాడు. గ‌త‌ రాత్రి బాధితుడి కుటుంబసభ్యులు అతడిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. దీంతో విషయాన్ని పేయింగ్‌ గెస్టు అకామిడేషన్‌(పీజీ) నిర్వాహకుడికి తెలుపగా, అతడు గదికి వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి వెళ్లిచూడగా గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. బాధితుడి కుటుంబానికి సమాచారం ఇచ్చామని వారు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.

శిక్ష‌ణ వ‌త్తిడి భ‌రించ‌లేకే ..

- Advertisement -

వివిధ పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటాలో విద్యార్థులు ఒత్తిడి కారణంగానే బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే ఈ ఆత్మహత్యలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజస్థాన్ ప్రభుత్వం పలుమార్లు పేర్కొంది. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచినప్పటికీ ఆత్మహత్యలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్ధుల‌కు కౌన్సెలింగ్ కేంద్రాలు నిర్వ‌హిస్తున్న మ‌ర‌ణాలు మాత్రం ఆగ‌డం లేదు ..

Advertisement

తాజా వార్తలు

Advertisement