జైపూర్ – లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో ఓటమి మూటకట్టుకుంది.. లక్నో నిర్ధేశించిన 155 పరుగులను ఛేదించలేకపోయింది.. నిర్ధారిత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది.. అరో వికెట్ గా జురేల్ పరుగులేమీ చేయకుండా వెనుతిరిగాడు.. అంతకు ముందు బాల్ కి అయిదో వికెట్ గా పడిక్కల్ 26పరుగులు చేసి ఔటయ్యాడు..ఈ రెండు వికెట్లు అవేష్ ఖాన్ కు లభించాయి..అలాగే నాలుగో వికెట్ గా .హిట్ మ్యాన్ హెట్మెయిర్ ను ఆవేష్ ఖాన్ రెండు పరుగులకు ఔట్ చేశాడు.. కేవలం మూడు ఓవర్లలో ఆర్ ఆర్ వరుసగా నాలుగు వికెట్లను కోల్పోయిది.. మూడో వికెట్ గా 41 పరుగులు చేసిన బట్టర్ ను స్పిన్నర్ రవి బిష్ణోయ్ పెవిలియన్ కు పంపాడు .. అంతుకు ముందు తొలి వికెట్ రూపంలో 44 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్ ను స్టోయినిస్ ఔట్ చేశాడు.. ఆ తర్వాత సంజూ రెండు పరుగులు చేసి రనౌట్ గా వెనుతిరిగాడు. ఈ మ్యాచ్ లో ఆవేష్ ఖాన్ కు మూడు వికెట్లు లభించాయి.
కాగా,బౌలింగ్ కు అనుకూలమైన పిచ్ మీద లక్నో సూపర్ జెయింట్స్ నిర్దారిత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.. విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ 155 పరుగులు చేయవలసి ఉంది.. లక్నో బ్యాటింగ్ లో మేయర్స్ 51 పరుగులు చేయగా, రాహుల్ 39, బదోని ఒక పరుగు, దీపక్ హుడా 2 , స్టోయినిస్ 21, పూరన్ 29, యద్ వీర్ సింగ్ ఒక్క పరుగు చేసి అవుటయ్యారు.. ఆర్ ఆర్ బౌలింగ్ లో అశ్వీన్ కు రెండు వికెట్లు రాగా, బోల్ట్, సందీప్, హోల్డర్ కి ఒక్కో వికెట్ లభించింది..