సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధి ఆదివారం భక్తజన సంద్రమైంది. సెలవు దినం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి క్షేత్రానికి తరలివచ్చారు. తెల్లవారుజామున నుండే పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దాదాపు 25 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement