Wednesday, September 18, 2024

TG | రాజముద్ర రగడ.. వరంగల్ లో ఫ్లెక్సీ

తెలంగాణ అధికారిక రాజముద్రను మార్చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం ఒక రెండు మూడు నమూనా చిహ్నాలు కూడా పరిశీలిస్తున్నారు. అయితే.. కొత్త చిహ్నం మీద ఎలాంటి అధికారిక ప్రకటన రాకుండానే.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

గ్రేటర్ వరంగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తెలంగాణ అధికారిక చిహ్నం స్థానంలో.. మరో కొత్త చిహ్నాన్ని ముద్రించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అసలు ఏం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా శాంతి కుమారి గారు? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌తో ఈ వెకిలి పనులు ఏంటి? కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement