రాజమహేంద్రవరం: రైలు షెడ్యూల్‌లో మార్పు కారణంగా ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. దీంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.
సుమారు 3 గంటలుగా రైలు అక్కడే నిలిచిపోయింది.జనవరి 1 నుంచి కాకినాడ పోర్టు- సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది. మార్చిన సమయం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకే కాకినాడ నుంచి రైలు బయల్దేరింది. గతంలో ఇదే రైలు ఉదయం 6 గంటలకు ఉండేది. జనవరి 1 నుంచి సమయంలో మార్పు జరగడంతో కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో పలువురు ప్రయాణికులు రైలు ఎక్కలేకపోయారు. సమయం మార్పుపై ముందుగానే సమాచారం ఇచ్చామని రైల్వే సిబ్బంది చెబుతున్నారు.
.ప్రయాణికుల ఫిర్యాదుతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. కాకినాడ, సామర్లకోటలో ఉన్న ప్రయాణికులను శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రాజమహేంద్రవరానికి తరలిస్తున్నారు. వారు చేరుకున్నాక సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ అక్కడి నుంచి బయల్దేరనుంది.