స్టేషన్ ఘన్ పూర్ (ప్రభన్యూస్): స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ ఎస్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. కడియం వర్సెస్ రాజయ్య వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది. ఇవ్వాల ఓ సభలో సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య ఫైర్ అయ్యారు. ఆయన దేవాదుల సృష్టికర్త కాదని, ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ కామెంట్స్ చేశారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో నిర్వహించిన ఆది జాంబవుని విగ్రహ భూమిపూజ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా సకల జనుల సమ్మెలో కాంగ్రెస్ నుండి రాజయ్య రాజీనామా చేస్తే కడియం శ్రీహరి పోటీ చేయనన్నారాని గుర్తు చేశారు.రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళగా మొట్టమొదట టీడీపీ నుండి నామినేషన్ వేశాడు.. కులము అనేది ఆత్మగౌరవంతో సమానం..కుల ప్రస్తావన జరగాలి.. పార్టీ నుండి బహిష్కరించిన వారే కడియం వెంటా ఉన్నారు…
నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నారని స్పష్టం చేశారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని వెంటనే సస్పెండ్ చేయాలని మండి పడ్డారు. ఆడియోలు, వీడియోలు అంటూ నాపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటా అని రాజయ్య పేర్కొన్నారు. నియోజకవర్గంలో 85 వేల ఎస్సీల ఓట్లు ఉంటే… 68వేలు ఓట్లు నికార్సైన మాదిగలవే అని ఈ సందర్బంగా చెప్పారు.