నల్గొండ : మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం పసునూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మంత్రి సబితా మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, గ్రామాల్లోకి వెళ్తుంటే కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజల్లో కమిట్మెంట్ కనిపిస్తుందన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఫ్లోరైడ్ ను రూపు మాపి సురక్షిత నది జలాలు అందించిన ఘనట ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం రాజీనామా చేశారన్నారు. ప్రజలు ఏకమై బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement