Tuesday, November 26, 2024

యూనిఫాం సర్వీస్‌ ఉద్యోగ నియామకాల్లో మూడేళ్ల వయో పరిమితి పెంపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ భర్తీలో నిరుద్యోగులకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన వయో పరిమితి సడలింపులో మినహాయింపులనివ్వని యూనిఫాం సర్వీస్‌ పోస్టుల్లో కూడా నియామకాల్లో నిరుద్యోగులకు మరో మూడేళ్ల వయో పరిమితిని సడలింపులనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ సర్వీస్‌లో భాగంగా ఈ మూడేళ్ల సడలింపులనిస్తూ జీవో 48ని జారీ చేసింది.

తద్వారా పోలీస్‌, ఎక్సైజ్‌, పైర్‌, జైళ్లు, ఎస్పీఎఫ్‌, రవాణా, అటవీ శాఖలకు చెందిన యూనిఫాం ఉద్యోగాల నియామకాలకు ఈ సడలింపు వర్తించనుంది. ఆయా యూనిఫాం సర్వీస్‌ల ఉద్యోగ భర్తీలో పాల్గొనే నిరుద్యోగులకు ఈ మూడేళ్ల వయో పరిమితి సడలింపు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement