పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహణకు కేంద్రం సిద్దమైంది. ఈనెల 20వతేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఆగస్టు 11న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వముంది.
అయితే ఈ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో సాగనున్నాయా? లేదా ప్రస్తుతం ఉన్న భవనంలోనే కొనసాగుతాయా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల రోజులక్రితం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పటికీ.. అందులో ఇంకా కొన్ని పనులు కొనసాగుతున్నాయి. కొత్త పార్లమెంటు భవనం సమావేశాలను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధం కాకపోతే, పాత భవనంలోనే వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది.