రాష్ట్రాంలో రోజు రోజుకు ఎండలు పెరిగి పోతున్నాయి.. దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే, ఇవ్వాల సాయంత్రం సమయంలో భాగ్యనగరాన్ని మబ్బులు కమ్మేయగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసాయి. దీంతో రెండు రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగర ప్రజలకు కాస్త ఉపశమనం దొరికినట్లు అయింది.
ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చైతన్యపురి, మలక్‌పేట్, చార్మినార్, బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠి, అబిడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుసింది. మిగతా ప్రాంతాల్లోనూ వాతావరణం చల్లబడి, ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఇక, తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 15, 16వ తేదీల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా తేదీల్లో మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది.