Friday, November 22, 2024

ఏపీకి చల్లటి కబురు..

గత  కొద్ది రోజులుగా మండుటెండలతో బెంబేలెత్తుతున్న ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంద్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే అత్యధిక వేడి, వడగాడ్పులతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement